సినీ పరిశ్రమకు అఖండ మూవీ ఊపిరిపోసింది.. బాలకృష్ణ

by srinivas |
balakrishna
X

దిశ, ఏపీ బ్యూరో: అఖండ మూవీ ఘన విజయం సాధించడంతో హీరో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సింహాచలం అప్పన్న, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్నలను దర్శించుకున్న బాలయ్య గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో బాలయ్య మరియు అఖండ టీం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది బాలయ్యకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలను అందించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమాను విడుదల చేశామని.. ఈ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టైమ్ సెన్స్ తో సినిమాను విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. అఖండ సినిమా విజయం సినీ పరిశ్రమకు ఊపిరిపోసినట్టనిపించిందని బాలయ్య వెల్లడించారు.

Advertisement

Next Story