హనుమ విహారి బాటలో లక్ష్మీపతి బాలాజీ

by Shyam |
హనుమ విహారి బాటలో లక్ష్మీపతి బాలాజీ
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో అనేక మంది ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర ఔషధాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. వారికి సహాయం చేయడానికి టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి వినూత్నంగా ఆలోచించారు. తాను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నా.. హైదరాబాద్, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొంత మంది వాలంటీర్లను సమీకరించి వారితో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. వీరి ద్వారా కరోనా రోగులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. విహారి చేస్తున్న సేవకు పలువురి నుంచి అభినందనలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు.

హనుమ విహారి స్పూర్తితో తాను కూడా కరోనా బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటూ క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా సరే తనకు తెలిసిన స్వచ్చంద సంస్థల ద్వారా కరోనా బాధితులకు సేవ చేయనున్నట్లు బాలాజీ తెలిపాడు. ‘అందరూ నాలాగ అదృష్టవంతులు ఉండరు. ఎంతో మంది ఔషధాలు, ఆక్సిజన్, బెడ్లు, ఆహారం కోసం కష్టాలు పడుతున్నారు. అందుకే తన వంతు సాయంగా ఎన్జీవోల ద్వారా అందిద్దామమని అనుకుంటున్నాను. క్వారంటైన్‌లో ఉండే ఈ పనులు మొదలు పెడుతున్నాను. నాకు హనుమ విహారే స్పూర్తి’ అని బాలాజీ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed