- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూడా పీవోపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్
దిశ ప్రతినిధి, వరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఏఐసీసీ నేత బక్క జడ్సన్ ప్రశ్నించారు. కూడా పీవోగా సుదీర్ఘకాలంగా ఒకే అధికారిని ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుందని నిలదీశారు. గతంలోనూ అజిత్‌రెడ్డిపై ఏసీబీ రైడ్ జరిగిందని, సస్పెన్షన్ చేసిన అధికారికి తిరిగి అదే స్థానంలో ఎలా పోస్టింగ్ ఇస్తారని అన్నారు. అజిత్ రెడ్డి కూడా పీవోగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జడ్సన్ ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా జడ్సన్ ఫిర్యాదు చేశారు.
వెంటనే ఆయనపై విచారణ చేపట్టాలని అధికారులను ఫిర్యాదులో కోరారు. దాదాపు దశాబ్దకాలానికి పైగా ఒకే పదవిలో ఒకే అధికారిని ఎలా కొనసాగిస్తారని అన్నారు. ఒకే పదవిలో ఉండేందుకు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడనే విషయం తేటతెల్లమవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కేటీఆర్ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సదరు అధికారిపై ఇంత ఉదాసీనత ఎందుకంటూ ప్రశ్నించారు. అజిత్ రెడ్డిపై వెంటనే విచారణ చేపట్టాలని, కూడా పీవో పోస్టింగ్ నుంచి వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.