Aryan Khan Drug Case.. ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్ మంజూరు

by Anukaran |   ( Updated:2021-10-28 06:09:07.0  )
Aryan Khan Drug Case.. ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, సినిమా: ముంబై హైకోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్‌ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకోగా.. అక్టోబర్ 8న ముంబైలోని అర్థుర్ జైలుకు తరలించారు. ఇప్పటికే దాదాపు మూడు వాయిదాల తర్వాత హైకోర్టును ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్ లీగల్ టీమ్.. ఫైనల్‌గా ఆర్యన్‌కు బెయిల్ తీసుకురాగలిగింది. తనతో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు. కాగా అక్టోబర్ 29న కారణాలతో కూడిన వివరణాత్మక ఉత్తర్వును ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది.

గురువారం విచారణ సందర్భంగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తరపున ASG అనిల్ సింగ్ మాట్లాడుతూ, ఆర్యన్‌కు ఇది కొత్తేమీ కాదని, గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ సేవిస్తున్నాడని చెప్పాడు. ఎన్‌డీపీఎస్ కేసుల్లో బెయిల్ కోసం ఉదారవాద విధానాన్ని తీసుకోలేమని ఎన్‌సీబీ తెలిపింది. మరోవైపు ఆర్యన్ ఖాన్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ, తన క్లయింట్ నుండి ఏమీ రికవరీ కాలేదని, అయినప్పటికీ తనపై కుట్రతో అభియోగాలు మోపుతున్నారని చెప్పాడు. కాగా, ఇదే కేసులో వాదనలు వినిపించిన ఎన్సీబీ ఆర్యన్ చాటింగ్‌ను సాక్ష్యాలుగా చూపించింది.

ఇందుకు సమాధానంగా ఆర్యన్ తరఫు న్యాయవాది ఆ వాట్సాప్ చాటింగ్‌ అమెరికాలో ఉన్పప్పటివి అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు లేవని.. అసలు అమెరికాలో డ్రగ్స్ తీసుకోవడం నేరమే కాదని అక్కడి చట్టాలను గుర్తు చేశారు. పాత వాట్సాప్ చాటింగ్‌లను చూపి అరెస్ట్ చేయడం సరికాదని కోర్టుకు తెలియజేశారు. ఇరు వాదనలు విన్న ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేస్తూనే.. వివరణాత్మక ఉత్తర్వును రేపు వెల్లడిస్తామంది.

ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే

Advertisement

Next Story

Most Viewed