మహిళలపై లైంగిక వేధింపులు.. నటుడిని సస్పెండ్ చేసిన బాఫ్టా

by Jakkula Samataha |
మహిళలపై లైంగిక వేధింపులు.. నటుడిని సస్పెండ్ చేసిన బాఫ్టా
X

దిశ, సినిమా : ది బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(BAFTA).. బ్రిటిష్ యాక్టర్, ప్రొడ్యూసర్ నోయల్ క్లార్క్‌ను సస్పెండ్ చేసింది. 20 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తను గతనెలలో పొందిన అవార్డు(ఔట్ స్టాండింగ్ బ్రిటిష్ కంట్రిబ్యూషన్ టు సినిమా)ను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని సూచించింది. ఏప్రిల్ 10న అవార్డు అందుకున్న నటుడు క్లార్క్.. ఈ గౌరవం అందుకున్న కొన్ని వారాలకే మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. కాగా పలు మీడియా సంస్థలు మాత్రం క్లార్క్ ఆ మహిళలను సెక్సువల్‌గా హరాజ్ చేశాడన్న విషయం బాఫ్టా ప్రతినిధులకు అవార్డ్ సెరమనీకి ముందే తెలుసని, అయినా అవార్డును తనకే అందజేశారని వార్తలు ప్రచురిస్తున్నాయి.

అయితే, కేవలం ఇండైరెక్ట్ అలిగేషన్స్ జరిగాయే తప్ప.. ప్రత్యక్షంగా మహిళలు సాక్ష్యం ఇవ్వలేకపోయారని బాఫ్టా ప్రతినిధులు చెప్తున్నారు. పేరు, సమయం, తేదీ, ప్రొడక్షన్స్.. ఇలా ఏ ఒక్క సమాచారం కూడా అందించనప్పుడు చర్యలు తీసుకోలేమని వెల్లడించారు. కానీ ‘ది గార్డియన్’ మీడియా సంస్థకు మహిళలు ఇచ్చిన సాక్ష్యాలను తమకు అందించలేకపోయినందుకు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నామని చెప్పారు. అలా చేసి ఉంటే క్లార్క్‌కు అవార్డ్ దక్కేది కాదని స్పష్టం చేశారు.

మరోవైపు యాక్టర్‌గా, ఫిల్మ్ మేకర్‌గా ది బెస్ట్ అనిపించుకున్న క్లార్క్.. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. తన 20ఏళ్ల కెరియర్‌లో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ ఎదుర్కోలేదన్నాడు. అయినా సరే తనతో పనిచేసిన ఎవరైనా తన ప్రవర్తన వల్ల అసౌకర్యంగా, అగౌరవంగా ఫీల్ అయితే తనను క్షమించాలని కోరాడు. తాను ఎవరినీ లైగింకంగా వేధించలేదని, ఈ ఆరోపణల నుంచి తనను తాను రక్షించుకుంటానని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed