బద్వేలు బైపోల్.. వైసీపీ అభ్యర్థిగా డా.సుధ నామినేషన్

by srinivas |
Sudha
X

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉపఎన్నికల్లో గెలుపొందుతామనే ధీమాగా ఉన్న వైసీపీ భారీ మెజారిటీ కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు తిష్ట వేశారు. బద్వేలులో సోమవారం బూత్ కన్వీనర్లతో సమావేశమయ్యారు. గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం వైసీపీ అభ్యర్థి డా.దాసరి సుధ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. అనంతరం దాసరి సుధ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనకు అవకాశం కల్పించారని, ప్రజలంతా తనకు మద్దతుగా నిలిచి భారీమెజార్టీతో గెలిపించాలని దాసరి సుధ కోరారు.

Advertisement

Next Story

Most Viewed