- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
దిశ, హైదరాబాద్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేయడంతో వైద్యం కోసం మూడు ఆస్పత్రులు తిరిగిన అనంతరం మృతి చెందింది. స్థానిక చంగిచర్ల సుశీల టౌన్ షిప్‌లో రోజువారి కూలీ పనిచేసే అంగోత్ హోలీ కుమార్తె బేబిని శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో 5 వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న ఆదిత్య ఆస్పత్రి, ఆ తర్వాత అంకుర ఆస్పత్రిలో వైద్యం చేసిన వైద్యులు.. వీరి వద్ద ఉన్న డబ్బులను ఖర్చు చేయించి అనంతరం పరిస్థితి విషమించినందని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాలని 3 గంటల సమయంలో సూచించారు. దీంతో బేబీని సికింద్రాబాద్ యశోదకు తరలించగా, ఆస్పత్రి యాజమాన్యం బేబీని చేర్చుకోవడానికి తిరస్కరించారు. ఇక గత్యంతరం లేక నల్లకుంట ఫివర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి ఓ గంట పాటు ప్రాథమిక వైద్యం చేసిన పిమ్మట నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. ఉదయం నుంచి సాయంత్రం నుంచి వైద్యం కోసం వివిధ ఆస్పత్రులు తిరిగిన బేబీకి వైద్య ఆలస్యం కావడం, ఒంటి నిండా గాయాలు కావడంతో నిలోఫర్ ఆస్ప్రతిలో గంట తర్వాత మృతి చెందింది.
వీధి కుక్కలు నిర్మూలించడంలో విఫలమైన బోడుప్పల్ మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బేబీకి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఆదిత్య, అంకురం ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీధికుక్కలను మున్సిపాలిటీ అధికారులు వెంటనే నిర్మూలించాలని, పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని, జనావాసాల్లో వీధికుక్కలు లేకుండా చూడాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. వీధి కుక్కల దాడిలో మరణించిన ఆరు సంవత్సరాల బాలిక దహన సంస్కారాల కోసం ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా సహయ పడాలని మేడ్చల్ కలెక్టర్‌ని కోరారు.