నేను తప్పు చేశా.. ‘బాబా కా దాబా’ ఓనర్

by Sujitha Rachapalli |   ( Updated:2021-06-12 10:37:10.0  )
నేను తప్పు చేశా.. ‘బాబా కా దాబా’ ఓనర్
X

దిశ, ఫీచర్స్ : గతేడాది కరోనా లాక్‌డైన్ టైమ్‌లో దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ‘బాబా కా దాబా’ ఓనర్ కాంత ప్రసాద్.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ఢిల్లీలో టిఫిన్ బండి మీద ఆధారపడి జీవించే కాంత ప్రసాద్ దంపతులు.. గత సంవత్సరం లాక్‌డౌన్‌లో వ్యాపారం లేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ వృద్ధ జంట పరిస్థితికి చలించిన యూట్యూబర్ గౌరవ్ వాసన్.. వారి వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెటిజన్లు భారీ మొత్తంలో సాయపడ్డారు. ఈ క్రమంలో కొత్తగా హోటల్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత తనకు సాయపడ్డ యూట్యూబర్ పైనే ఆరోపణలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా ఈ ‘బాబా కా దాబా ఓనర్’ మళ్లీ పాత గూటికే చేరుకున్నాడు.

కొత్తగా ప్రారంభించిన హోటల్‌‌‌కు.. కరోనా కారణంగా నష్టాలు తలెత్తడంతో భరించలేని ప్రసాద్, తిరిగి తన పాత హోటల్‌కు వచ్చేశాడు. గతంలో తనకు రావాల్సిన సాయాన్ని కాజేశాడని యూట్యూబర్‌ గౌరవ్‌పై ఆరోపణలు చేసిన ఆయన.. ప్రస్తుతం తనకు కూడా క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసిన కాంత ప్రసాద్.. గౌరవ్‌ మా డబ్బులు వాడుకున్నాడని చెప్పి తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story