ఈ మాస్క్ పెట్టుకుంటే గ్యారంటీగా కరోనా రాదంటున్న బాబా

by Shamantha N |
ఈ మాస్క్ పెట్టుకుంటే గ్యారంటీగా కరోనా రాదంటున్న బాబా
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది లేయర్స్ ఎక్కువగా ఉన్న మాస్క్ లను ధరిస్తున్నారు. మరికొంత మంది రెండు,రెండు మాస్క్ లును ధరిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాబా మాత్ర వైరీటీ మాస్క్ ధరించి అందరిని ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఆ మాస్క్ ఏంటీ అనుకుంటున్నారు కదా.. వన మూలికలు మన ఆయుర్వేదంలో అంతర్భాగం అంటారు. మందులతో నయంకానీ ఎన్నో రోగాలు ఆయుర్వేద వనమూలికలతో నయం అవుతుంటాయి.

ఉత్తరప్రదేశ్ సీతాపూర్ లో జుగాడి అనే బాబా ఉంటారు. అతను వెరైటీగా వనమూలికలతో తయారు చేసిన మాస్కు ధరిస్తూ అందరిని ఆలోచింపచేస్తున్నాడు. కరోనా విజృంభన నేపథ్యంలో ఖరీదైన మాస్క్ లు పెట్టుకుంటే కరోనా రాదనే గ్యారంటీ ఉందా.. కానీ ప్రకృతి సిద్ధంగా తయారైన వనమూలికల మాస్క్ పెట్టుకుంటే కరోనా దరి చేరదంటూ ఆ బాబా చెప్తున్నాడు. అతను ఆ మాస్క్ ను నిమ్మ, తులసి ఆకులతో పాటు మరికొన్ని వనమూలికతో తయారు చేశారు. ఇలా వనమూలికలతో చేసిన మాస్కు పెట్టుకుంటే కరోనానే కాదు ఎలాంటి వైరస్ మన దగ్గరికే రాదు .. పైగా ఆరోగ్యానికి కూడా ఈ మాస్కు ఎంతో మంచిదని చెప్తున్నాడు. ఈ ఆకుల్లో ఉండే సుగుణాలు మనల్ని ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా కాపడుతాయని పేర్కొన్నాడు.

Advertisement

Next Story