- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఐడీని ఇలా కూడ వాడుకుంటారా.. అయ్యన్నపాత్రుడు ఫైర్
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై కక్ష సాధింపునకు ఏపీ ప్రభుత్వం సీఐడీని వాడుకుంటుందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఐడీని ఇలా వాడుకోవడం దారుణమన్నారు. ఎన్టీఆర్‌భవన్‌లో శనివారం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సంబంధం లేకపోయినా సీఐడీ వేధిస్తోందని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిధుల కేటాయింపునకు సంతకం చేసిన ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి గంటా సుబ్బారావును అరెస్టు చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పుకొచ్చారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుసా అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు రావడం లేదని విమర్శించారు. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆందోళనతో ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పుకొచ్చారు. అవినీతి సీఎం ఉంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని నిలదీశారు. అందువల్లే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.