ఊహించని మలుపులతో ‘అనేక్’ : ఆయుష్మాన్

by Jakkula Samataha |
ఊహించని మలుపులతో ‘అనేక్’ : ఆయుష్మాన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. సినిమా సినిమాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్-డైరెక్టర్ అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘అనేక్’. గతంలో ఇదే కాంబోలో తెరకెక్కిన ‘ఆర్టికల్ 15’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. కాగా ప్రస్తుతం ‘అనేక్’ షూటింగ్ కంప్లీట్ అయినట్లు హీరో ఆయుష్మాన్ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ఎక్కువ భాగం ఈశాన్య రాష్ట్రాల్లోనే జరిగిన ఈ చిత్ర షూటింగ్ విశేషాలను పంచుకున్నాడు.

‘అనేక్ షూటింగ్ రోజులను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్, ఊహించని సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను అమితంగా అలరిస్తుంది’ అని తెలిపాడు. సినిమా షూటింగ్ చివరిరోజున (శనివారం) తాను భావోద్వేగానికి గురయ్యానని, ఇది ఒక న్యూ ఏజ్ సినిమా అని పేర్కొన్న ఆయుష్మాన్.. డైరెక్టర్ అనుభవ్ సిన్హాతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తానని, ‘మై లాస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్ పోస్ట్’ అంటూ షూటింగ్ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌ను డేట్ త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు.

Advertisement

Next Story