యూత్ తలచుకుంటే సాధ్యమే! : ఆయుష్మాన్

by Shamantha N |
యూత్ తలచుకుంటే సాధ్యమే! : ఆయుష్మాన్
X

దిశ, వెబ్‌డెస్క్ : నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానా సమాజంలో నిర్మాణాత్మక, సానుకూల మార్పులను తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే టైమ్ మ్యాగజైన్ వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్ లిస్ట్‌లో చేరిన ఆయుష్మాన్.. పిల్లలపై హింసను అంతం చేసేందుకు గాను యూనిసెఫ్ చేపట్టిన గ్లోబల్ క్యాంపెయిన్ సలహాదారుగా నియమించబడ్డారు. ఈ క్రమంలో నేషనల్ యూత్ డే సందర్భంగా.. ‘దేశయువత చిన్నపిల్లలపై హింసకు వ్యతిరేకంగా ఎలా పోరాడొచ్చు, ఎలాంటి మార్పులు తీసుకురావొచ్చు’ అనే అంశాల గురించి స్పెషల్ పోస్ట్ పెట్టారు.

సరైన అవగాహనతో యూత్ ఒక శక్తిగా మారినప్పుడు మాత్రమే వాయిలెన్స్‌ను అంతం చేయగలుగుతామని.. గణనీయమైన మార్పులు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. హింసను అనేక రూపాల్లో గుర్తించేందుకు, సమవర్థవంతంగా అంతం చేసేందుకు.. తోటి వారిని ప్రభావితం చేయడంలో యూత్ సక్సెస్ కాగలదన్నారు. వీధిలో ఒక అమ్మాయిని వేధిస్తున్నప్పుడు స్నేహితుడిగా తనకు సపోర్ట్ అందించడం, వాయిలెన్స్‌ను అడ్డుకునేందుకు హెల్ప్ లైన్‌కు కాల్ చేయడం లాంటివి డైలీ లైఫ్‌లో భాగంగా చేసుకుంటే.. పిల్లలు, అమ్మాయిలు ప్రాణాలతో బయటపడటానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed