‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశ పెట్టకపోవడం దారుణం’

by Shyam |
‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశ పెట్టకపోవడం దారుణం’
X

దిశ రాజేంద్రనగర్ : రాష్ట్రంలో కరోనా బాధితులు పిట్టల రాలిపోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రోగులను పట్టించుకున్న పాపాన పోలేదని శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ అన్నారు. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని కిస్మత్పూర్ లోని తన నివాసంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని దీక్ష చేపట్టినట్లు స్వామి గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ప్రజలు కరోనాతో ఎంతో మంది కష్టనష్టాలకు గురవుతున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా రోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేర్చడం లేదన్నారు. కరోనా రోగులకు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టి, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాధితో వేలాది మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు భీమాను చెల్లిస్తోంది అన్నారు. నిరుపేదలకు ఎంతగానో ఆయుష్మాన్ భారత్ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలని స్వామి గౌడ్ డిమాండ్ చేసారు.

Advertisement

Next Story