తెలంగాణలో బాక్ల్ ఫంగస్‌కు ఆయుష్ వైద్యం

by Shyam |
తెలంగాణలో బాక్ల్ ఫంగస్‌కు ఆయుష్ వైద్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్సలందించేందుకు సీఎస్ సోమేష్ కుమార్ ఆయుష్ వైద్యులతో మంగళవారం సమీక్షలు నిర్వహించారు. ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు సీఎస్ సోమేష్ కుమార్ కు వివరించారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో చికిత్సలు అందిస్తామని సీఎస్ తెలిపారు. ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు, ప్రెస్ బ్రీఫింగ్‌ల ద్వారా పేషంట్లకు అవగాహన కల్పించాలని ఆయుష్ వైద్యులకు సూచించారు.

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ వ్యాధికి చికిత్సలందించేందుకు గాంధీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి. కింగ్ కోఠి ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రిజ్వి, తెలంగాణ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ ఎం.జ్యోతి, ఆయుష్ విభాగం డైరెక్టర్ డా.అలగు వర్షిణి, ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారు డా. గంగాధర్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, హోమియోపతి డాక్టర్లు డా.లింగా రాజు, డా. పి. నవీన్, ప్రొఫెసర్ కె.రజని చందర్, ప్రొఫెసర్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి , ఆయుర్వేద డాక్టర్లు డా. సురేష్ జఖోటియా, డా. ప్రవీణ్ కుమార్, డా. శైలేష్ నాథ్ సక్సేనా, యునాని డాక్టర్లు ప్రొఫెసర్ బొఖారీ, ప్రొఫెసర్ సలావుద్దీన్, డా. ఎం.హెచ్. కజ్మి, డా. మిన్హాజుద్దీన్ , అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed