- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య మసీదు నిర్మాణ పనులు ప్రారంభం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. 72వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతకాన్ని ఆవిష్కరించడంతోపాటు మొక్కలను నాటి మసీదు నిర్మాణ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయం నిర్మాణానికి అనుమతిస్తూ 2019లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు అదే జిల్లాలో మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్య రామజన్మభూమి స్థలానికి 25కి.మీ.ల దూరంలో ధనిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం స్థలం కేటాయించారు.
ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ మసీదు నిర్మించనున్నారు. మంగళవారం ఉదయం 8.45గంటలకు ఐఐసీఎఫ్ ట్రస్ట్ చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫారూఖీ జాతీయ పతాకం ఆవిష్కరించారు. నిర్మాణం కోసం ముగ్గు పోసిన చోట 12 మంది ట్రస్టు సభ్యులు మొక్కలను నాటారు. నిర్మాణం స్థలంలో నేల పరీక్షలను ప్రారంభించాం. ఒకరకంగా సాంకేతికంగా మసీదు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లే. నేల పరీక్షల రిపోట్లు రాగానే, ఫ్లాన్స్‌కు ఆమోదం పొందగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మసీదు నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు అని ఐఐసీఎఫ్ ట్రస్టు చైర్మన్ ఫారూకీ తెలిపారు.