- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగిని చంపడంతో పాటు ప్రాణప్రతిష్టలో విధ్వంసం సృష్టిస్తాం.. టెర్రరిస్ట్ హెచ్చరిక కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో: జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఖలిస్థానీ టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను చంపుతామని ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించారు. ఈ మేరకు తాజాగా టెర్రరిస్ట్ పన్ను ఒక ఆడియో సందేశంలో బెదిరింపు రికార్డింగ్ పంపాడు. యూపీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని, వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పట్టుబడ్డ వారిని హింసిస్తున్నారని వెల్లడించారు.
అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉందని, ఆ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్‌జే నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని, తమ సమాధానం జనవరి 22 నే ఇస్తామని బెదిరింపులకు దిగాడు. అవసరమైతే రాజకీయ హత్యలు చేస్తామని హెచ్చరించారు. కాగా, యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తాజాగా అయోధ్యలో ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్ట్ పన్నూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ముగ్గురు అనుమానితులను ఏటీఎస్ నిరంతరం విచారిస్తోంది. సెక్యూరిటీ ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం, సీఎం యోగికి బెదిరింపు సందేశంలో వాయిస్ రికార్డింగ్ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లోని ఒక ప్రదేశం నుంచి అని గుర్తించారు. ప్రస్తుతం ఈ మెసేజ్‌కి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.