రామ్ లల్లా విగ్రహానికి వాడిన కృష్ణ శిల వయసెంతంటే?

by Shamantha N |   ( Updated:2024-01-23 13:42:30.0  )
రామ్ లల్లా విగ్రహానికి వాడిన కృష్ణ శిల వయసెంతంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య‌లో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. కాగా.. బాలరాముడి విగ్రహాన్ని కృష్ణ శిలపై చెక్కారు. అందరూ ఆ బ్లాక్ గ్రానైట్ గురించి తెలుసుకుంటున్నారు. కృష్ణ శిల గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు 250 కోట్ల ఏళ్ల క్రితం ఆ రాయి ఏర్పడిందని సమాచారం. ఈ విషయాన్ని బెంగళూరు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ తెలిపారు. కృష్ణ శిలపై 51 అంగుళాల బాలరాముడ్ని శిల్పి యోగిరాజ్ ఆరునెలలు కష్ట పడి చెక్కారు. ఫిజియో మెకానికల్ పద్ధతితో కృష్ణశిలపై టెస్టింగ్ నిర్వహించింది ఎన్ఐఆర్ఎం సంస్థ. దేశంలోని డ్యామ్ లు, న్యూక్లియర్ ప్లాంట్లకు కావాల్సిన రాళ్లను కూడా ఆ సంస్టే టెస్టింగ్ చేస్తుంది.

కర్ణాటకలోని మైసూరు జిల్లా జయపుర గ్రామంలోని గ్రానైట్ గనుల నుంచి ఈ శిలను తీసుకున్నారు. ఇక్కడ హై క్వాలిటీ గ్రానైట్స్ ఉంటాయి. విగ్రహం కోసం వాడిన గ్రానైట్ ప్రీ కాంబ్లియన్ యుగానికి చెందినదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ శిలలు దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. భూమి సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. కాగా బాలరాముడి విగ్రహానికి వాడిన కృష్ణశిల భూమి వయసులో సగం ఉన్నట్లుగా భావిస్తున్నారు.




రామ్ లల్లా కోసం గ్రానైట్ చాలా కాలం మ‌న్నిక‌గా ఉంటుంద‌న్నారు ఎన్ఐఆర్ఎం డైరెక్టర్. ఎలాంటి వాతావరణాన్ని అయినా ఆ గ్రానైట్ తట్టుకోగలదు. దేశంలోని ఉష్ణోగ్రతల్లోనూ ఆ కృష్ణ శిల వేల సంవత్సరాలపాటు పదిలంగా ఉంటుందన్నారు. లావా చల్లారిన తర్వాత ఈ శిల ఏర్పడిందని.. అందుకే ఇది చాలా గట్టిగా ఉంటుందన్నారు.

న‌ల్ల గ్రానైట్ లో ఉన్న గుణాల వ‌ల్ల ఆ శిలకు ఎలాంటి ఆకృతైనా ఇవ్వొచ్చు. రాయిలో సాంద్రత ఎక్కువగా ఉంది. ఎలాంటి రంధ్రాలు పడవు.. ఇలాంటి గుణాలవల్ల రాయిలో చీలికలు ఏర్పడటం చాలా చక్కువ అని తెలిపారు. బ్లాక్ గ్రానైట్ కు నీటిని పీల్చే గుణం ఉండదు.. కార్బన్ తో రియాక్ట్ అయ్యే గుణం లేదు. అందుకే ఆ శిలను ఎన్నుకున్నారు.




కొత్త‌గా నిర్మించిన అయోధ్య రామాల‌యం కోసం అత్యంత నాణ్యమైన శిలలు వాడామన్నారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. న్యూ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ప్రెసీజర్స్ ద్వారా ఆ రాళ్లు చాలా కాలం పాటు మన్నికగా ఉండేలా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. వెయ్యి ఏళ్ల పాటు అలానే ఉండేలా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.

Read More..

రామ్ లల్లా విగ్రహానికి వాడిన కృష్ణ శిల వయసెంతంటే?

Advertisement

Next Story

Most Viewed