- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధారణ భక్తులకు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రాముడి భక్తులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టం జరుగనుంది. ఈ మహత్తర కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. వీరితో పాటు లక్షలాది మంది భక్తులు కూడా రానున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయోధ్యలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 వేల మంది పోలీసులు, 10 వేల సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అయోధ్య తీర్థక్షేత్ర టస్ట్ అధికారులు శుభవార్త చెప్పారు. రేపటి నుంచి సాధారణ భక్తులకు ఆలయంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించారు. రేపటి నుంచి రోజూ ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు.