- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోల్డెన్ టెంపుల్, వాటికన్ సిటీని మించిపోనున్న అయోధ్య..!
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రతిష్ఠను ప్రపంచమంతా వీక్షించింది. రేపటి నుంచి సామాన్య భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఏడాదిలో దాదాపు 5 కోట్ల మంది భక్తులు రామ మందిరాన్ని దర్శించే అవకాశం ఉందంది బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్. ఒక వచ్చే నెలలోనే 2 కోట్లమంది భక్తులు దర్శనానికి రానున్నట్లు అంచనా వేసింది. గోల్డెన్ టెంపుల్, వాటికన్ సిటీ కంటే ఎక్కువమంది అయోధ్య రామమందిరానికి రానున్నట్లు అంచనా. రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరాన్ని సుమారు రూ.85 వేల కోట్లతో అభివృద్ధి చేశారని తెలిపింది. కొత్త ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్, టౌన్ షిప్, రోడ్ కనెక్టివిటీ ఇలా అయోధ్య అభివృద్ధికి కోసం భారీగా ఖర్చు చేశారు. ప్రస్తుతం రాముడి దర్శనానికి రానున్న భక్తులు, పర్యాటకం.. ఇలా యూపీ ప్రభుత్వానికి రూ.25 వేల కోట్లకు పైగా ఆదాయం అందనుంది. గోల్డెన్ టెంపుల్, మక్కా, వాటికన్ సీటీ మాదిరిగానే గ్లోబల్ టూరిజం స్పాట్‌గా రూపాంతరం చెందుతుందని తెలిపింది.రాబోయే కాలంలో అయోధ్యలో పర్యాటకుల ఖర్చు సంవత్సరానికి రూ.4 లక్షల కోట్ల మార్కు దాటే ఛాన్స్ ఉందని తెలిపింది ఎస్బీఐ నివేదిక.