రుణాల కోసం హ్యూండాయ్‌తో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం!

by Harish |
రుణాల కోసం హ్యూండాయ్‌తో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో రిటైల్ ఫైనాన్సింగ్ కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ బుధవారం తెలిపింది. ఈ భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్.. హ్యూండాయ్ కస్టమర్లకు ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ రిటైల్ వేదిక ‘క్లిక్ టు బై’లో నేరుగా ఆటో లోన్ మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకు తెలిపింది.

ఈ భాగస్వామ్యం ద్వారా పట్టణ, గ్రామీణ మార్కెట్లలోని వినియోగదారులకు ఆన్‌లైన్‌లో కార్ ఫైనాన్సింగ్ అత్యంత సులభంగా పొందే వీలుంటుందని పేర్కొంది. ‘హ్యూండాయ్ మోటార్స్‌తో భాగస్వామ్యంతో ఆన్‌లైన్ ఫైనాన్సింగ్ ద్వారా కస్టమర్లకు తక్కువ వ్యవధిలో, ఇబ్బందుల్లేకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత కరోనా మహమ్మారి కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ భాగస్వామ్యం కస్టమర్లకు డిజిటల్ సేవలందించడం సంతోషంగా ఉంది’ అని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లెండింగ్ అండ్ పేమెంట్స్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి చెప్పారు.

Advertisement

Next Story