చట్టాలపై అవగాహన సదస్సు

by Sridhar Babu |
seminar
X

దిశ, నూతనకల్: చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ జాన్ సుందర్ అన్నారు. శుక్రవారం నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో జాతీయ న్యాయ సేవా సమితి పిలుపు మేరకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు.. ధనికులు అన్న తేడా ఉండదు అందరూ చట్టం దృష్టిలో సమానమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం కొరకు న్యాయ సేవల అధికారిక చట్టం ద్వారా ఉచిత న్యాయం అందించబడుతదని ఆయన తెలిపారు. సంవత్సరానికి రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన వారందరికీ మండల న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసి.. కేసు యొక్క పూర్తి వివరాలు సమర్పించడం ద్వారా ఉచిత న్యాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాతంగి సోమ నరసమ్మ ఎల్లయ్య, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, సాయిల్ గౌడ్, వివోఏ పర్ష, లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు రాధిక, నర్మద, జయమ్మ, గణేష్, చిరంజీవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed