బిగ్ బాస్‌లోకి కమెడియన్ ఎంట్రీ?

దిశ, వెబ్ డెస్క్:

బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ హిట్ అవడం ఖాయం అనిపిస్తోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ కాగా.. మరో సభ్యుడు కూడా వీరితో చేరబోతున్నట్టు సమాచారం. జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 13న అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోటల్‌లో క్వారెంటైన్ పీరియడ్‌లో ఉన్న అవినాష్.. ఇంటి సభ్యుడుగా బిగ్ బాస్ ఇంట్లోకి చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇప్పటికే ఎవరికి వారు తమ ప్లాన్ ప్రకారం వెళ్తుండగా.. బయట మాత్రం గంగవ్వ హవా నడుస్తోంది.

Advertisement