తక్కువ ధరలో మొబైల్ డేటా.. ఇండియాలోనే!

by  |
తక్కువ ధరలో మొబైల్ డేటా.. ఇండియాలోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో కూర్చుని.. జస్ట్ వేళ్ల కొనలతో ఆపరేట్ చేస్తూ పనులన్నీ చక్కబెడుతున్న నేటి టెక్ జమానాలో.. ఇంటర్నెట్ పాత్ర కీలకం. కాగా, గడిచిన ఐదేండ్లలో మొబైల్ డేటా సేవలకు 1 బిలియన్ ఇండివిడ్యుల్స్ అదనంగా యాక్సెస్ అయ్యారు. అందుకే కాస్ట్ పరంగా ‘మొబైల్ డేటా’ విలువ ఒక దేశానికి, మరో దేశానికి ఎంతో తేడా ఉంటుంది. 1 జీబీ మొబైల్ డేటా విలువ 228 దేశాల్లో ఏ విధంగా ఉందనే అంశంపై యూకే బేస్డ్ వెబ్‌సైట్ ‘కేబుల్’ సర్వే చేసింది. కాస్ట్ వేరియన్ ఎందుకుందో కూడా ఆ బృందలోని పరిశోధకులు ఓ అంచానకు వచ్చారు. ఈ కేబుల్ రిపోర్ట్ ప్రకారం ఇండియా, ఇజ్రాయిల్, ఇటలీ, ఉక్రెయిన్, కిర్గిస్థాన్ దేశాల్లో మొబైల్ డేటా వినియోగం తక్కువేనని తేలింది.

1 జీబీ డేటా వినియోగానికి అతి తక్కువ చెల్లిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇక్కడ వన్ జీబీ డేటా విలువ కేవలం 0.09డాలర్లు (6.76పైసలు). ఇండియాలోని మొబైల్ కంపెనీల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ వల్లనే ఇంత తక్కువ ధరలో మొబైల్ డేటా వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు రిలియన్స్ జియో రాకతో.. మొబైల్ డేటా విలువ చాలా తగ్గిపోయిందని, వారు వెల్లడించారు. అయితే.. కంపెనీలు ప్రస్తుతం ఇలా తక్కువ రేట్లకు మొబైల్ డేటా అందిస్తున్నా.. భవిష్యత్తులో మాత్రం ఇంత చీప్‌గా ఇచ్చే అవకాశం లేదని రిపోర్టు వెల్లడించింది.

కిర్గిస్థాన్‌లో 1 జీబీ మొబైల్ డేటాకు 0.21 డాలర్లుగా ఉంది. ఇక్కడ కూడా రిలయన్స్ ఆధిపత్యం వల్లనే ఇంత తక్కువలో డేటా వస్తోంది. 1 జీబీ డేటాకు అతి ఎక్కువ ధర చెల్లించే దేశాల లిస్టులో మలావి, బెనిన్, చాడ్, యెమెన్, బోట్స్‌వాన నిలుస్తాయి. ఈ ఐదింటిలో నాలుగు దేశాలు ఆఫ్రికాకు చెందినవే కావడం గమనార్హం. సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అందుకు కారణం కాగా.. మార్కెట్ కాంపిటీషన్ అంతగా లేకపోవడం మరో కారణం.

ఆయా దేశాల్లో 1 జీబీ మొబైల్ డేటా విలువ:

మలావి : 27.41 డాలర్లు (రూ. 2043.91)
బెనిన్ – 27.22 డాలర్లు (రూ. 2058.18)
చాద్ – 23.33 డాలర్లు (రూ. 1751.70)
యెమెన్ – 15.98 డాలర్లు (రూ. 1199.83)
బోట్సవాన – 13.87 డాలర్లు (రూ. 1041.41)

ఇండియా – 0.09 డాలర్లు
ఇజ్రాయిల్ – 0.11 డాలర్లు
కిర్గిస్థాన్ – 0.21 డాలర్లు
ఇటలీ – 0.43 డాలర్లు
ఉక్రెయిన్ – 0.46 డాలర్లు


Next Story