Oben Roar EZ: ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి స్టైలిష్ ఈవీ బైక్ విడుదల.. ధర రూ.89,999 మాత్రమే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-09 10:47:57.0  )
Oben Roar EZ: ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి స్టైలిష్ ఈవీ బైక్ విడుదల.. ధర రూ.89,999 మాత్రమే..!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ప్రస్తుతం విద్యుత్ వాహనాల(EV)కు డిమాండ్ వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. అధిక పెట్రోల్ ధరల నేపథ్యంలో చాలా మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు చాలా కంపెనీలు దేశీయ వాహన మార్కెట్లో ఎన్నో కొత్త కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్(Electrical Vehicles)ను లాంచ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా స్వదేశీ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్(Oben Electric) నుంచి కొత్త ఈవీ బైక్(EV Bike) విడుదలైంది. రోర్ ఇజెడ్‌(Roar EZ) పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని స్టైలిష్ గా డిజైన్ చేశారు. రూ.89,999(Ex-Showroom) ప్రారంభ ధరతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ బైక్ మూడు బ్యాటరీ వేరియంట్ లలో లభించనుంది. 2.6 kWh, 3.4 kWh, 4.4 kWh లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దీనిలో అత్యాధునిక పేటెంట్ కలిగిన LFP బ్యాటరీ టెక్నాలజీ ఉంది. దీని బ్యాటరీని 50 శాతం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేశారు. ఇక ఈ బైక్ 95 km/h గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ బైక్ కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 km/h స్పీడ్ అందుకోగలదు. ఇది 52 Nm బెస్ట్-ఇన్-క్లాస్ టార్క్ ను ప్రొడ్యూస్ చేయగా.. 175 కిమీ(IDC) వరకు మైలేజ్(Mileage)ని ఇస్తుంది. రోర్ ఇజెడ్‌ బ్యాటరీ కేవలం 45 నిమిషాల్లోనే 80 ఛార్జ్‌ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. కాగా ఈ కంపెనీకి ప్రస్తుతం బెంగళూరు, దిల్లీ, కొచ్చి, త్రివేండ్రం, పూణే సహా మరెన్నో ప్రధాన మెట్రో నగరాల్లో షోరూం(Showroom)లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 అవుట్ లెట్లను ప్రారంభించాలని ఒబెన్ ఎలక్ట్రిక్ యోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed