- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ సీజన్‌లో ఫ్లాట్ విక్రయాలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం, అంతకుముందు మందగమనం కారణంగా డిమాండ్ కోల్పోయిన ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లు పండుగ సీజన్‌లో ఫ్లాట్‌గా లేదంటే వృద్ధిని ఆశిస్తున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ(ఇక్రా) తెలిపింది. కరోనా ప్రభావం వల్ల ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమ దేశవ్యాప్తంగా కఠినమైన పరిస్థితులను అధిగమించేందుకు పంపిణీ విభాగంలో మెరుగైన ఫలితాలను చూసే అవకాశాలున్నాయని ఇక్రా పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 75-90 శాతం క్షీణత నమోదైనప్పటికీ, హోల్‌సేల్ విక్రయాలు రికవరీ ధోరణిలో ఉన్నాయి. టూ-వీలర్, ప్యాసింజర్ వాహనాల విభాగాలు సెప్టెంబర్‌లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నాయని ఇక్రా అభిప్రాయపడింది. అయితే, ఇప్పటికీ రిటైల్ డిమాండ్ బలహీనంగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాల విభాగాలపై గ్రామీణ, సెమీ అర్బన్, మెట్రో ప్రాంతాల్లో జరిపిన సర్వే ప్రకారం రానున్న పండుగ సీజన్‌లో డీలర్‌షిప్‌ల వద్ద వృద్ధి ధోరణి ఆశాజనకంగా ఉన్నట్టు గుర్తించామని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ ఆశిస్ వెల్లడించారు.