- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దెబ్బతిన్న ఆటో అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: రెండేళ్లుగా దేశీయ ఆటో కంపెనీలను తీవ్రంగా బాధిస్తున్న సెమీకండక్టర్ల కొరత కారణంగా నవంబర్‌లో వాహన అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. అక్టోబర్‌లో పెరిగిన తర్వాత గత నెలలో ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత, గ్రామీణ డిమాండ్ తక్కువగా ఉండటం, రుతుపవనాల ఆలస్యం, ఖరీఫ్ పంట కోత ఆలస్యంతో గ్రామీణ కొనుగోలు తీవ్రంగా ప్రభావితమవడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అన్ని కంపెనీల అమ్మకాల్లో మినహాయింపుగా టాటా మోటార్స్ 25 శాతం, టయోటా కిర్లోస్కర్ 53 శాతం, నిస్సాన్ 60 శాతం అమ్మకాలు పుంజుకున్నాయి.
టాటా మోటార్స్ కంపెనీ అన్ని విభాగాల్లో లాభదాయకంగా విక్రయాలు సాధించింది. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం, కమర్షియల్ వాహనాలు 15 శాతం పెరిగాయి. ఇక, దేశీయ ప్యాసింజర్ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన అమ్మకాలు 9.16 శాతం క్షీణించాయి. మహీంద్రా 2 శాతం అమ్మకాలు కోల్పోగా, టీవీఎస్ మోటార్ కంపెనీ 14 శాతం, బజాజ్ ఆటో 10 శాతం అమ్మకాల క్షీణతను నమోదు చేశాయి. హోండా కార్స్ 31 శాతం, కియా మోటార్స్ 13 శాతం, హ్యూండాయ్ 21 శాతం, ఎంజీ మోటార్ 40 శాతం అమ్మకాలు దెబ్బతిన్నాయి. ట్రాక్టర్ అమ్మకాల్లో ఎస్కార్ట్స్ 30 శాతం, అశోక్ లేలాండ్ 2 శాతం అమ్మకాలు తగ్గాయి. ఐషర్ మోటార్స్ విక్రయాలు 10 శాతం, మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు 15 శాతం పడిపోయాయి.