రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను కొనేందుకు ఏఐఐఎల్ ఆసక్తి

by Harish |
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను కొనేందుకు ఏఐఐఎల్ ఆసక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రుణ భారంతో దెబ్బతిన్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను కొనేందుకు ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఏఐఐఎల్) అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. ఈ ఒప్పందం కోసం ఏఐఐఎల్ రూ. 2,887 కోట్లకు బిడ్ వేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.

ఈ ఒప్పంద ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 2,587 కోట్ల దక్కే అవకాశం ఉంది. గతవారం ఏఐఐఎల్ సంస్థ రూ. 2,911(రూ. 24 కోట్ల వడ్డీతో సహా) బిడ్‌ను ఫైనాన్షియల్ క్రెడిటర్స్‌కు అందించినట్టు కంపెనీ వెల్లడించింది. 15 ఏళ్లుగా దేశీయ ఎన్‌బీఎఫ్‌సీగా సేవలు అందిస్తున్న ఏఐఐఎల్ సంస్థ గతేడాది వరకు రూ. 1,500 కోట్ల నికర విలువను కలిగి ఉంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేసేందుకు ఏఐఐఎల్ కాకుండా గ్లోబల్ కేపిటల్, ఏఆర్‌సీఐఎల్ భాగస్వామ్యంతో అవెన్యూ కేపిటల్, గ్లోబల్ ఫండ్ ఏఆర్ఈఎస్ ఎస్ఎస్‌జీతో పాటు ఆస్తుల సంరక్షణ, పునర్నిర్మాణ సంస్థ(ఏసీఆర్ఈ) బిడ్ వేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story