పవన్ ఒక డైనమైట్.. మహేష్ తో చాలా కష్టం – విజయేంద్ర ప్రసాద్

by Shyam |   ( Updated:2021-06-01 02:46:43.0  )
పవన్ ఒక  డైనమైట్.. మహేష్ తో చాలా కష్టం – విజయేంద్ర ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మగధీర’ (Magadheera), ‘బాహుబలి’ (Bahubhali) లాంటి పవర్ ఫుల్ కథలను చిత్ర పరిశ్రమకు అందించి తెలుగు ఇండస్ట్రీ ని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రముఖ రచయిత, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి.. విజయేంద్ర ప్రసాద్. ఇక ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి కథను అందించిన ఆయన ఆ సినిమా కబుర్లను ఒక ఇంటర్వ్యూ లో తెలుపుతూ పలువురు టాలీవుడ్ స్టార్లపై ఉన్న తన మనో భావాలను బయటపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) కి ఎలాంటి కథను రాస్తారు అన్న ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఒక కథ రాయాల్సిన అవసరం లేదు.. ఆయన నటించిన సినిమాలలో అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసుకుంటే కథ తయారవుతుంది. హీరోయిన్లతో డాన్సులు, విలన్స్ తో ఫైట్ లు, మధ్యలో ప్రజలకు కాస్త మేలు చేసే పనులు ఇవి ఉంటే చాలు.. ఆయన కోసం అభిమానులు థియేటర్లకు వచ్చేస్తారు. పవన్ ఒక డైనమైట్.. ఆయన సినిమాల్లోని కొన్ని సీన్లను తీసుకొని రాస్తే కొత్త కథ తయారవుతుంది. ఎందుకంటే డైనమైట్‌ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు కదా.. మళ్లీ దానికోసం స్పెషల్ గా కథ రాయాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)గురించి చెప్తూ ” మహేష్ కు కథ రాయడమనేది చాలా కష్టమైన విషయం అది ఖచ్చితంగా టఫ్ జాబ్.. మహేస్ కు కథ రాయాలంటే పూరీ జగన్నాథ్ సలహా తీసుకోవాలని నవ్వేశారు.” ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed