- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సింగ్ డే టెస్టుకు సేమ్ టీమ్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హడల్‌వుడ్ కలిసి 9 వికెట్లు తీసి టీమ్ ఇండియాను 36పరుగులకే కుప్పకూల్చారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసిస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ నెల 26(శనివారం) నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. చివరి నిమిషంలో ఏమైనా అనుకోని పరిణామాలు జరిగితే తప్ప మార్పులకు అవకాశంలేదని వెల్లడించాడు. గురువారం నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాంగర్ మాట్లాడుతూ, ‘బాక్సింగ్ డే టెస్టు కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయట్లేదు. తొలి టెస్టులో జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో రెండో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగనున్నాం’ అని వెల్లడించాడు.