- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టు త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ పర్యటనలో ఆసీస్ జట్టు 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు షెడ్యూల్‌లో మార్పు చేసి మరో రెండు టీ20లు అదనంగా ఆడాలని నిర్ణయించింది. ఆగస్టులో ఆసీస్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి 5 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ నిర్దారించారు. అస్ట్రేలియా సిరీస్ మ్యాచ్‌లకు తగిన సమయం ఉండటానికి తమ జింబాబ్వే పర్యటనలో ఒక టెస్టును రద్దు చేసింది. జూన్‌లో జింబాబ్వేలో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు రెండు టెస్టుల బదులు ఓకే టెస్టు ఆడనున్నది. షెడ్యూల్ ప్రకారం 3 వన్డేలు, 3 టీ20లు ఆడి స్వదేశానికి తిరిగి రానున్నది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం స్వదేశంలో న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్లతో కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనున్నది.