- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండో వన్డేలో ఆసీస్ దూకుడు
దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ క్రికెట్ వేదికగా జరుగుతున్న భారత్ vs ఆసీస్ మూడు వన్డేలా సిరీస్ సెకండ్ మ్యాచ్‌లో కంగారులు పరుగుల వరద పారించారు. తొలి నుంచే ఏకధాటిగా రాణించిన బ్యాట్స్‌మెన్లు భారత ఆటగాళ్లను పరిగెత్తించారు. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 389 పరుగుల భారీ స్కోర్ చేశారు.
సమిష్టిగా రాణించిన బ్యాట్స్‌మెన్లు..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83), ఆరోన్ ఫించ్(60) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్(104) సెకండ్ వన్డే మ్యాచ్‌లో కూడా చెలరేగి ఆడాడు. 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేశారు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన మార్నస్ (70) పరుగులు చేశాడు.
ఆ తర్వాతి స్థానల్లో వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(63), హెన్రిక్స్(2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 389 పరుగులు చేసింది. ఇక 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఇక మూడు వన్డేలా సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
Australia Innings 389-4 (50 Ov)
1. డేవిడ్ వార్నర్ రనౌట్ (శ్రేయస్ అయ్యర్)83(77)
2. ఆరోన్ ఫించ్ (c)c కోహ్లీ b షమీ 60(69)
3. స్టీవ్ స్మిత్ c షమీ b హార్దిక్ పాండ్యా 104(64)
4. మార్నస్ లాబుస్చాగ్నే cమయాంక్ అగర్వాల్ b బుమ్రా 70(61)
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాటౌట్ 63(29)
6.హెన్రిక్స్ నాటౌట్ 2(1)
Extras: 7
Total Score: 389/4
Wickets:142-1 (ఫించ్, 22.5), 156-2 (వార్నర్, 25.3), 292-3 (స్టీవ్ స్మిత్, 41.2), 372-4 (మార్నస్ లాబుస్చాగ్నే, 48.5).
Bowler:
1.మహ్మద్ షమీ 9-0-73-1
2.జస్ప్రీత్ బుమ్రా 10-1-79-1
3.నవదీప్ సైని 7-0-70-0
4.యూజువేంద్ర చాహల్ 9-0-71-0
5.రవీంద్ర జడేజా 10-0-60-0
6.మయాంక్ అగర్వాల్ 1-0-10-0
7.హార్దిక్ పాండ్యా 4-0-24-1