- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌పై వాళ్లింకా ఆశలు వదులుకోలేదు !
కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు క్రీడా ఈవెంట్లు వాయిదాపడ్డాయి. కాగా, బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఏప్రిల్ 15 వరకు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈ నెల 15 తర్వాతైనా ఐపీఎల్ దాదాపు అసాధ్యమనే పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కన్నా ముందు ఐపీఎల్ నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నా.. అది అంత సులువైన పని కాదనేది పలువురి వాదన. ఇలా.. ఈ ఏడాది ఐపీఎల్‌కు అన్ని దారులు మూసుకుపోతుండగా, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ జరుగుతందనే ఆశతో ఉండటం విశేషం.
ఈ ఐపీఎల్ సీజన్‌కు అత్యధిక విలువైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్.. ఇప్పటికీ ఈ లీగ్ జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఆ జాబితాలో స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. ఐపీఎల్-13 కచ్చితంగా జరుగుతుందని, ఈ క్యాలెండర్ ఇయర్‌లోనే ఏదో ఒక సమయం చూసుకొని ఐపీఎల్ నిర్వహిస్తారని స్మిత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ప్రపంచమంతా కరోనా బారిన పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి ఆలోచించడం సరైనది కాకున్నా.. ఐపీఎల్ ఏదో ఒక సమయంలో జరుగుతుందనే ఆశ మాత్రం ఉందన్నాడు.
Tags: Steve Smith, Pat Cummins, IPL, T20 World cup, Corona