- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరబిందో యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ కార్మికులు ఆరోపిస్తున్నారు. లేబర్ చట్టాలను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు నోటిసులు ఇచ్చినా వాటిపై యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. కేన్సర్ బారినపడిన కార్మికులను ఆదుకోవాలని యూనియన్లు ఎంత మొరపెట్టినా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది.
యాజమాన్యానికి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యూనియన్ ఇచ్చి 21 నెలలు గడుస్తున్నా వాటిని పరిష్కరించకపోవడంతో కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని యూనియన్లు తప్పుబడుతున్నాయి.