నరబలి కేసులో అత్తాకోడలికి మరణశిక్ష!

by Sumithra |
నరబలి కేసులో అత్తాకోడలికి మరణశిక్ష!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో సాంకేతికపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ప్రపంచ దేశాలు భారత్ రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుకుంటుంటే.. మరోవైపు దేశంలోని పలుచోట్ల మూఢనమ్మకాల పేరుతో ‘నరబలి’ పేరుతో హత్యా ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీటిని ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే నలిబలి ఇస్తే తమకు మగబిడ్డ కలుగుతాడని భావించిన అత్తాకోడళ్లు ఓ నాలుగేళ్ల మగ పిల్లాడిని బలిచ్చారు. ఈ ఘటన 5 సెప్టెంబర్ 2017లో బీహార్‌లో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసు విచారణ పూర్తి కాగా అత్తాకోడళ్లు దోషులుగా తేలడంతో వారికి కోర్టు మరణశిక్ష విధించింది.

వివరాల్లోకివెళితే.. గోపాల్‌గంజ్‌ జిల్లాలోని చితౌనాలో మగ సంతానం కావాలని సన్‌కేశా అనే మహిళ ఆశపడింది. తనకు మగబిడ్డ కలగాలంటే మరో మగబిడ్డను బలి ఇస్తే తనకు బాబు పుడతాడని ఎవరో చెబితే విశ్వసించింది. ఆ విషయం అత్త దుర్గావతికి చెప్పడంతో ఆమె కూడా అందుకు ఒకే అన్నది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి అదే ప్రాంతంలో ఉండే కుమార్‌ అనే 4ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి బలిచ్చారు.

అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని వాళ్ల ఇంటికి కొద్ది దూరంలో విసిరేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ హత్యకేసులో అత్తాకోడలిని అదుపులోకి కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా వారింట్లో సోదాలు చేయగా రక్తపు బట్టలు, వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం అత్తాకోడళ్లను కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో న్యాయమూర్తి లవ్‌కుశ్‌ కుమార్ వారిద్దరికీ మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితులిద్దరికీ మరణశిక్ష పడటంతో బాధిత కుటుంసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed