- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముట్టుకోకుండా కాస్మోటిక్స్ షాపింగ్!
అమ్మాయిలు, ఆడవాళ్లు మేకప్ సామాను, కాస్మోటిక్స్ కొనడానికి వెళ్లినపుడు.. వారికి నచ్చే వస్తువు కొనడానికి 200 రకాల వస్తువులను వారి ముఖానికి రుద్దుకుని పరీక్షిస్తారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆ అదృష్టం లేదు. ఏదన్నా ముట్టుకుని పరీక్షిద్దామనుకుంటే దాన్ని ఇంతకుముందు ఎవరు ముట్టుకున్నారోననే భయం వెంటాడుతోంది. దీంతో కాస్మోటిక్స్ అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఈ సమస్య పరిష్కారమై అమ్మకాలు మళ్లీ పుంజుకోవడానికి దక్షిణ కొరియాకు చెందిన అమొరోపసిఫిక్ కాస్మోటిక్స్ సంస్థ ఒక అద్దాన్ని అందుబాటులో ఉంచింది.
అది మామూలు అద్దం కాదండోయ్.. అగుమెంటెడ్ రియాలిటీతో పనిచేసే అద్దం. అంటే ఇందులో ముఖం చూసుకోగానే ఇది మీ ఫొటో తీస్తుంది. తర్వాత మీ ముఖాన్ని ఆమూలాగ్రం విశ్లేషించి మీ చర్మం తీరు, ముడతలు, డార్క్ సర్కిల్స్ ఉన్నాయా లేదా అని కనిపెడుతుంది. తర్వాత షాపులో ఉన్న ఏ ఉత్పత్తి మీకు సరిపోతుందో.. అది వేసుకుంటే మీరెలా కనిపిస్తారో చూపిస్తుంది. అంతేకాకుండా అక్కడ కనిపించే ఆప్షన్లు ఉపయోగించి మీరు వివిధ ఉత్పత్తులను ఎంచుకుని, అవి వేసుకుంటే మీరెలా కనిపిస్తారో చూసుకోవచ్చు. దీని వల్ల ఉత్పత్తిని ముట్టుకోవాల్సిన పనే ఉండదు.