- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే కోలుకుంటాం : ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల (Luxury cars) తయారీ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes Benz India), ఆడి (Audi) రానున్న పండుగ సీజన్లో( festive season) తమ కార్ల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. రానున్న కొద్ది నెలల్లో మొత్తం వ్యాపారాలు (Businesses)క్రమంగా మెరుగుపడతాయని ఎదురుచూస్తున్నట్టు కంపెనీలు వెల్లడించాయి.
కరోనా పరిణామాలతో మారిన పరిస్థితుల్లో డిజిటల్ (Digital) విధానం, కొత్త ఆర్థిక విధానాల (New economic policies)తో వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతుందని తెలిపాయి. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ (country’s economy)లో అంతరాయాలు ఏర్పడ్డాయని, దీంతో ఆటో పరిశ్రమ (Auto industry) తీవ్రంగా దెబ్బతిన్నదని, రానున్న పండుగ సీజన్ కంపీనీలకు కలిసొస్తాయని పేర్కొన్నాయి.
పండుగ సీజన్‌లో వినియోగదారుల నుంచి డిమాండ్ (Demand) క్రమంగా కరోనాకు ముందున్న స్థాయిలో ఎక్కువ భాగం భర్తీ చేయగలమనే నమ్మకం ఉంది. గత కొద్దిరోజులుగా నెలవారీ అమ్మకాల ధోరణిని గమనిస్తే అమ్మకాల్లో పునరుజ్జీవ సంకేతాలు కనిపిస్తున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes Benz India) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మార్టిన్ స్వెంక్ (Managing Director, CEO Martin Svenk) చెప్పారు.
కరోనాకు ముందున్న స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఇదివరకటి మాంద్యంతో పోల్చలేదు. తేలికైన సమస్య కాదు, కాబట్టి కొన్నాళ్లు వేచి చూస్తామని ఆయన పేర్కొన్నారు. పండుగ సీజన్ ఆటో పరిశ్రమ (Auto industry)కు బలమైన అమ్మకాల కాలమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ (Audi India Head Balbir Singh) అన్నారు. లగ్జరీ కార్ల మార్కెట్లో ( luxury car market) సానుకూల వినియోగదారుల సెంటిమెంట్‌ను ఆశిస్తున్నాం. రానున్న పండుగ సీజన్లో ఇది మరింత బలంగా ఉండనున్నట్టు బల్బీర్ సింగ్ తెలిపారు.