- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేట కలెక్టరేట్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందు ప్రయత్నించగా.. స్థానికులు, సిబ్బంది అడ్డుకున్నారు. తనకు తెలియకుండా తన వ్యవసాయ భూమిని వేరేవాళ్లకు పట్టా చేశారని ఆరోపిస్తూ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. సోమవారం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృషించింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన తిరగరాజు మాణిక్యమ్మ తన మనవడైన పెద్దారపు నాగరాజును దత్తత తీసుకోని పెంచుకుంటున్నది. అతడి పేరు మీద ఎకరంన్నర వ్యవసాయ భూమిని గిఫ్ట్ డిడ్ కింద పట్టా చేసింది. కానీ నాగరాజు మ్యూటేషన్ చేయించుకోలేదు.
అయితే మాణిక్యమ్మ కోడలు ఆ భూమిని వారికి తెలియకుండా పట్టా చేయించుకుంది. దీనిపై స్థానికంగా పంచాయితీ జగరడంతోపాటు హుజూర్ నగర్ కోర్టులో కేసు కూడా వేశారు. నాటి నుంచి రెవెన్యూ అధికారులను కలిసి తనకు పట్టా చేయాలని నాగరాజు కోరుతున్నాడు. కేసు కోర్టులో ఉన్నందున అధికారులు దానిని పక్కకు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తన పేరు మీద భూమి పట్టా కాదేమో అనే అనుమానంతో నాగరాజు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. సిబ్బంది, స్థానికులు అడ్డుకోని అతడిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.