పీఎస్‌లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Shyam |
పీఎస్‌లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, నల్లగొండ: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం గ్రామానికి చెందిన గుంజ సతీష్ అనే వ్యక్తి అదే మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన భవాని అనే యువతిని కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ఇరువురు కులాలు వేరు వేరు కావడంతో తరుచుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భవాని కుటుంబ సభ్యులు సతీష్ పై వేములపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం స్టేషన్ కు వచ్చిన సతీష్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీస్ స్టేషన్ లోనే తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతడిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని నల్లగొండ తరలించాలని డాక్టర్ సూచించడంతో అంబులెన్స్ లో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు యత్నించాడని యువకుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story