చిలకలగూడలో దారుణం.. కానిస్టేబుల్ మెడపై బ్లేడ్‌తో దాడి

by Sumithra |
చిలకలగూడలో దారుణం.. కానిస్టేబుల్ మెడపై బ్లేడ్‌తో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి బ్లేడ్‌లో దాడి చేశాడు. మెడపైన గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది వెంటనే కానిస్టేబుల్‌ను యశోద ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. చిలకలగూడ సర్కిల్ మార్కండేయ నగర్‌లో నివసించే శ్రీనాథ్, పరమేష్‌లకు మంగళవారం అర్ధరాత్రి.. ఓ మహిళ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన శ్రీనాథ్.. పరమేష్‌పై దాడికి చేశాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన పరమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన శ్రీనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా శ్రీనాథ్ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిరణ్ మెడపై దాడి చేశాడు. దీంతో వెంటనే కిరణ్‌ను నగరంలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story