PLI Scheme: నాన్‌ సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీకి పీఎల్ఐ స్కీమ్‌ వర్తింపు

by S Gopi |
PLI Scheme: నాన్‌ సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీకి పీఎల్ఐ స్కీమ్‌ వర్తింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: నాన్-సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రకటించారు. దీనికోసం రూ. 22,919 కోట్ల ప్యాకేజీ ప్రకటించగా, ఇది ఆరేళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఫలితంగా రూ. 59,350 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 91,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడమే కాకుండా ఆరేళ్ల కాలంలో పరోక్షంగా లక్షలాది మందిని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014-15లో రూ. 1.90 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ, 2023-24 నాటీకి రూ. 9.52 లక్షల కోట్లకు పెరిగింది. అంతేకాకుండా ప్రతి ఏడాది 17 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గడిచిన దశాబ్ద కాలంలో మిగిలిన వాటి కంటే దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 2014-15లో రూ. 38 వేల కోట్ల నుంచి 2023-24 నాటికి రూ. 2.14 లక్షల కోట్లతో 20 శాతం వార్షిక వృద్ధి రేటును కలిగి ఉంది.

Next Story

Most Viewed