- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రౌడీ షీటర్లు సమాజ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనొద్దు

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా పేరు నమోదైన వ్యక్తులు ఎటువంటి క్రిమినల్ చర్యలు, సమాజ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకూడదని భువనగిరి ఏసీపీ కంకణాల రాహుల్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భువనగిరి డివిజన్‌కు చెందిన భువనగిరి టౌన్, బీబీనగర్, భువనగిరి రూరల్, బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు ఎక్కడ కూడా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్లడితే సహించేది లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులూ నమోదు చేయడంతో పాటు, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మంచి ప్రవర్తన కనబరిచే వ్యక్తుల పేర్లను రౌడీ షీట్ నుండి తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో ఉన్న రికార్డులను ఆయన స్వయంగా పరిశీలించి, రౌడీ షీటర్లు, డ్రగ్ పెడ్లర్లు, అనుమానిత వ్యక్తులపై కఠిన నిఘా పెట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. భద్రతా పరంగా రాబోయే రంజాన్ పర్వదినానికి గాని, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భువనగిరి డివిజన్ లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు. ఇందులో మొత్తం భువనగిరి డివిజన్ లో 78 మంది యాక్టీవ్ రౌడీ షీటర్స్ కి 53 మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఉమెన్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ అర్జునయ్య, భువనగిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్, బీబీనగర్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, భువనగిరి రూరల్ ఎస్ హెచ్ వో సంతోష్ కుమార్, బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలం, టౌన్ ఎస్ఐలు కుమార స్వామి, లక్ష్మీనారాయణ, అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.