మోసపోయానంటూ యువతి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

by Jakkula Mamatha |   ( Updated:2025-03-28 14:18:08.0  )
మోసపోయానంటూ యువతి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఇటీవల ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఏలూరు జిల్లా(Eluru District) జీలుగుమిల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో ఫార్మ్ బీ ఫైనలియర్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా యువతి ఓ వైపు చదువుకుంటూనే నగరంలోని ఓ ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అక్కడే ఆ యువతిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.

దీంతో ఆ యువతి సూసైడ్ నోట్(Suicide Note) రాసి ఈ నెల 23న మత్తుమందు తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు వెల్లడించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని(23) ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు. ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని అన్నారు. ఇక నేచురల్‌గానే రికవరీ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఆ యువతి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు మాధవరావు దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై అతన్ని విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed