నిమజ్జనంలో గొడవ.. ఎంపీటీసీపై రాళ్లు, కర్రలతో దాడి.. ఒంటిపై రక్తంతో MPTC

by Sumithra |
నిమజ్జనంలో గొడవ.. ఎంపీటీసీపై రాళ్లు, కర్రలతో దాడి.. ఒంటిపై రక్తంతో MPTC
X

దిశ, తాండూర్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఎంపీటీసీపై దాడి జరిగింది. నిన్న రాత్రి జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్దముల్ గ్రామానికి చెందిన రవి(35), అంబరయ్య(42) నిమజ్జన ఊరేగింపులో ఎంపీటీసీ ఇంటి ముందు వెళ్లారు. ఈ క్రమంలో గణపయ్య ఊరేగింపును ఎంపీటీసీ అంబరయ్య, కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు నిలుచుని చూస్తున్నారు.

ఇదే సమయంలో రవి, అంబరయ్య.. ఎంపీటీసీ అంబరయ్య పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ ఎంపీటీసీ సదరు ఇద్దరు వ్యక్తులను నిన్న రాత్రి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోపం పెంచుకున్న రవి, అంబరయ్య ఆదివారం ఉదయం ఎంపీటీసీ ఇంటి మీదకు వెళ్లి రాళ్లు, కర్రలతో అంబరయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఈ క్రమంలో విడిపించడానికి వెళ్ళిన ఎంపీటీసీ తమ్ముడు వెంకటయ్య పై కూడా వారు రాళ్లతో దాడి చేశారు. దాడి అనంతరం ఎంపీటీసీ స్థానిక పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి కారణంగా తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు ఎంపీటీసీకి వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం.

Next Story

Most Viewed