- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పోస్టులు.. కాంగ్రెస్ కార్యకర్తపై దాడి
దిశ, తాండూరు : తాండూర్ పట్టణంలోని ప్లైఓవర్ బ్రిడ్జీపై గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ కార్యకర్త గాజుల మన్నన్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ ఐదుగురు వ్యక్తులు అతడిపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. గాయపడిన మన్నన్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. మన్నన్‌పై దాడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఇలా రౌడీలను పెట్టి కొట్టించటం హేయమైన చర్య అంటూ అభివర్ణించారు. అలాగే ఎమ్మెల్యేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే ఇలా దాడి చేయడం సరికాదని, కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు వేసుకోలేదని.. దాడికి ప్రతి దాడి కచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, నాయకులు బాతుల వెంకటేష్, కావలి సంతోష్, మోహిన్, వరాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.