వారిద్దరి మధ్య ప్రేమ.. సినిమా బ్యాన్ చేయాలని నెటిజన్ల డిమాండ్

by Shyam |
Atrangi re
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా ఉన్న ‘అత్రంగి రే’ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘అత్రంగి రే’కి ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా అంతే అత్రంగిగా ఇచ్చారు. కొందరు ఈ సినిమాలో నటీనటుల నటన అద్భుతమని అంటే, కొందరు కథ బాగుందని ప్రశంసిస్తున్నారు. మరికొందరు సినిమా విషయంలో పెదవి విరుస్తున్నారు. ఇంతలో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ మరో వర్గం వారు కోరుతున్నారు.

ఈ సినిమా లవ్ జీహాదీని ప్రేరేపించేలా ఉందని వారు వాదిస్తున్నారు. ఈ సినిమాలో రింకు రఘువంశీ అనే హిందూ అమ్మాయి పాత్రలో సారా అలీఖాన్ కనిపించింది. అదే విధంగా సజ్జాద్ అలీ ఖాన్ అనే ముస్లిం యువకుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. దీనిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ సినిమా లవ్ జీహాదీని ప్రేరేపిస్తోందని, సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేస్తున్నారు. హిందీ సినిమాల్లో లవ్ జీహాదీని ప్రోత్సహిస్తున్నారని, దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story