ఒలింపిక్స్ కోసం వచ్చిన అథ్లెట్లకు కరోనా

by Shyam |
ఒలింపిక్స్ కోసం వచ్చిన అథ్లెట్లకు కరోనా
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చి అథ్లెట్లకు కరోనా సోకడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. సెర్బియాకు చెందిన రోయింగ్ టీమ్ శనివారం టోక్యో సమీపంలోని హెనెడా విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి అక్కడే యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారించబడ్డారు. వెంటనే అధికారులు అతడిని ఐసోలేషన్‌కు పంపి.. అతడితో కలసి ప్రయాణం చేసి వచ్చిన మిగిలిన నలుగురిని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని జపాన్ ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలోతెలిపింది.

గత వారం ఉగాండా నుంచి వచ్చిన అథ్లెట్లలో ఇద్దరికి కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. జులై 23న టోక్యోలో సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలకు చెందిన క్రీడాకారులు జపాన్ వస్తున్నారు. వీరిందరికీ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయంలోనే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి మూడు రోజుల క్వారంటైన్‌కు పంపుతున్నారు. క్వారంటైన్ తర్వాత మరోసారి పరీక్ష చేసి వారిని క్రీడా గ్రామానికి పంపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వారం వ్యవధిలో ముగ్గురు అధ్లెట్లు కరోనా బారిన పడటంపై అధికారులు ఆందోళనగా ఉన్నారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed