ఆరు నూరైనా నెక్స్ట్ సీఎం చంద్రబాబే: అచ్చెన్నాయుడు

by srinivas |
achem-naidu
X

దిశ, ఏపీ బ్యూరో: ఆరు నూరైనా.. ఎవ్వరు అడ్డొచ్చినా మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని దీన్ని కాపాడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. విభజన హామీ ప్రకారం విద్యుత్ పరంగా రూ.6,500 కోట్లు తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని, ఈ బకాయిలు రప్పించే దమ్ము జగన్‌కు లేదని విమర్శించారు. ఒక్క చాన్స్ అని అడగడంతో ఈ వైసీపీ దరిద్రాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు లాంటి సమర్ధవంతమైన నాయకులు వస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కపడదని అభిప్రాయపడ్డారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. ‘2014లో చంద్రబాబు హయాంలో 22.5 ట్రిలిన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉండేది. రూ. 36వేల కోట్ల పెట్టుబడితో 10 వేల మెగావాట్లు విద్యుత్ తెచ్చారు. ప్రస్తుత సీఎం పరిపాలన చేతగాని వ్యక్తి. రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూసివేయడానికి ఈ ప్రభుత్వం అడిగింది. అప్పటికి ఇప్పటికి విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. చంద్రబాబు హయాంలో ఇంటికి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇచ్చాం. డిస్కమ్‌లు ఇన్‌విడ్యువల్ చేసి, వ్యవస్థలను నాశనం చేశారు. అలాగే కార్మికులను రెగులరైజ్ చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని’ అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని కార్మికులు ఎప్పుడూ టీడీపీ వెన్నంటే ఉండేవారని అయితే జగన్ పాదయాత్రలో తప్పుడు మాటలకు మోసపోయారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇచ్చాం, హెచ్ఆర్ఏ ఇచ్చాం. అయితే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం రెండున్నరేళ్లైనా ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు. పీఆర్సీ ఇస్తే జీతాలు తగ్గుతాయని చెప్తున్నారు ఇదెక్కడి చోద్యమో నాకు తెలియడం లేదు. కార్మికులకు, ప్రజలకు మంచి జరగాలి అంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Advertisement

Next Story