- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు సహకరిస్తే జైలుకే : అచ్చెన్నాయుడు
దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ క్విడ్ ప్రో కో-2కు తెరలేపారని ఆరోపించారు. గతంలో క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు భారీ లాభాలు చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. సరస్వతి సిమెంట్స్ లీజు గడువును పెంచారని.. ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు.
అరబిందోకు కాకినాడ పోర్టు, అంబులెన్సుల కాంట్రాక్టు కట్టబెట్టారని.. హెటిరోకు విశాఖలో బేపార్క్ భూములు దారాదత్తం చేశారంటూ ధ్వజమెత్తారు. రాంకీ ఫార్మా అధినేతను రాజ్యసభకు పంపించగా.. వాన్ పిక్ నిందితుడు నిమ్మగడ్డ కోసం కేంద్ర మంత్రులతో రాయబారాలు నడిపారని విరుచుకుపడ్డారు. అంతేకాకుండా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజును 2035 వరకు పొడిగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన కేసుల్లో ఉన్న నిందితులను ఏపీకి రప్పించి మరీ పదవులివ్వడంతోపాటు సంపదను పప్పు బెల్లాల్లా సహ నిందితులకు పంచుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. సర్వం దోచేస్తున్నారన్నారు. క్విడ్ ప్రో కో-1 సహకరించిన ఎంతో మంది జైలుకెళ్లారని..క్విడ్ ప్రో కో-2కు సహకరించే వారికీ అదే గతి పడుతుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.