- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు దగ్గరలోనే ఉంది: అచ్చెన్నాయుడు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల విధులను టీడీపీ నేతలు అడ్డుకోలేదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కేవలం వైసీపీ నాయకుల రిగ్గింగ్‌ను మాత్రమే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. దొంగల పార్టీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటు అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ కక్ష సాధిస్తోందని.. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వైసీపీ చేస్తున్న అక్రమాలు పోలీసులకు కనిపించకపోవడం దారుణమన్న అచ్చెన్న.. టీడీపీ నేతలకు వర్తించిన సెక్షన్లు వైసీపీకి వర్తించవా అంటూ ప్రశ్నించారు. ఇన్ని అనర్థాలు జరుగుతుంటే డీజీపీ, ఎస్‌ఈసీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు కూడా తొందరలోనే వస్తోంది అంటూ అచ్చెన్నా జోస్యం చెప్పారు.
Advertisement
Next Story