కరీనా పెళ్లిలో మలైకా అలా చేస్తుందనుకోలేదు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..

by Shyam |   ( Updated:2021-11-23 01:50:46.0  )
kareena
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తాజాగా సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్‌ పెళ్లి వేడుక గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సంగీత్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ సిస్టమ్, డ్యాన్స్ ప్రోగ్రామ్‌పై హాట్ బ్యూటీ మలైకా అరోరా చాలా సీరియస్ అయినట్లు చెప్పింది. ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ న్యూ సీజన్‌ గెస్ట్‌గా అటెండ్ అయిన కరిష్మా.. ‘కరీనా పెళ్లిలో సంగీత్ కోసం అందరం నవ్వుతూ, సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం.

అయితే మలైకా మాత్రం అందరూ పర్ఫెక్ట్‌గా స్టెప్పులు వేస్తున్నారా లేదా చూస్తూ సూచనలు ఇస్తుంది. అయితే తను చెప్పేది పట్టించుకోకపోవడంతో సీరియస్‌గా అరవడంతో షాక్ అయ్యాం. కానీ ఆ తర్వాత మళ్లీ కలిసి నవ్వుకున్నాం’ అని వివరించింది. అలాగే తమ గ్యాంగ్‌లో మలైకా బెస్ట్ డ్యాన్సర్ అని.. మలైకా, కరీనాతో స్ట్రాంగ్ బాండింగ్ ఉందని.. అమృతా ఆరోరా, మాలికా భట్ కూడా తమ గ్యాంగ్‌లో భాగమేనని చెప్పింది.

కేరళ నీళ్లలో ‘గ్రహాంతర చేపలు’.

Advertisement

Next Story

Most Viewed